Sunday, July 17, 2011

ఆంధ్రపత్రిక స్వర్ణోత్సవ సంచిక 1964-65




ఆంధ్రపత్రిక స్వర్ణోత్సవ సంచిక కొరకు ఇక్కడ క్లిక్ చేయండి: ఆంధ్రపత్రిక స్వర్ణోత్సవ సంచిక 1964-65

ఈ  ఆంధ్రపత్రిక స్వర్ణోత్సవ సంచిక విశేషం ఏమిటంటే ఇందులో తెలుగు సాహిత్యానికి సేవ చేసిన గిడుగు రామమూర్తి పంతులు గారు, దువ్వూరి రామిరెడ్డి గారు, పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, తాపీ ధర్మారావు గారు,సురవరం ప్రతాపరెడ్డి గారు, జలసూత్రం రుక్మిణీ నాధ శాస్త్రి గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, గోపీచంద్ గారు మొదలగు ఉద్దండులైన ఎందఱో వ్రాసిన అమూల్యమైన వ్యాసాలు ఉన్నాయి. చదివి తరించండి.

ఆంధ్రపత్రిక గురించి:
ఆంధ్రపత్రిక తెలుగువారు గర్వించదగిన తెలుగు పత్రిక.

1908 సంవత్సరం సెప్టెంబరు 9 తేదీన, తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.


1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు.


1914 సంవత్సరంలో పత్రికను మద్రాసుకు తరలించారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికగా ఏప్రిల్ 1 వ తేదీన ప్రచురణ ప్రారంభమైనది. తెలుగు పంచాంగం ప్రకారం ఆనంద నామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్ఠి నాడు ఆంధ్రదినపత్రిక జన్మించింది.

నాగేశ్వరరావు తరువాత శివలెంక శంభుప్రసాద్ ఆంధ్రపత్రిక దిన, వార పత్రికలకు మరియు భారతికి సంపాదకులైనారు. ఆయన కాలంలోనే హైదరాబాదు మరియు విజయవాడ లలో ఆంధ్రపత్రిక ఎడిషన్లు ప్రారంభమైనాయి.