Tuesday, January 4, 2011

పింగళికి వీరతాడు - సాక్షి నుండి జనవరి 2, 2011

పింగళి నాగేంద్రరావు
29 డిసెంబరు 1901 - 6 మే 1971

‘‘ముక్కోపానికి విరుగుడు
ముఖస్తుతి ఉండనే ఉంది’’

‘బ్రహ్మ’ మనుషులను సృష్టిస్తాడు
‘పింగళి’ మాటలను సృష్టిస్తాడు.
అందుకే తెలుగు భాషకు ఆయన ఓ కొనసాగింపు!



పింగళిని వెలుగులోకి తెచ్చిన ‘గుణసుందరి కథ’ తెలుగుకు, తెలుగు సినిమాకు చేసిన మేలు అంతా ఇంతా కాదు. తాను పుట్టిన వందేళ్ల తరవాత కూడా ఆయన పుట్టించిన ‘గురూ’, ‘సాహసం చేయరా డింభకా’ చాలామందికి ఊతపదాలు. ‘ఘాటు ప్రేమ’ పదం వాడినప్పుడు దుష్ట సమాసమని విమర్శలొస్తే ‘భాషను కట్టడి చేసి కనుమరుగు చేయడం కంటే ఇది మేలు’ అన్నారు.

మాట, పాట, నాటకం.. ఈ మూడు కళల్లోనూ సిద్ధహస్తుడు పింగళి. పాతాళభైరవి, అప్పుచేసి పప్పుకూడు, జగదేకవీరుని కథ, మాయాబజార్... వీటికి మనుషులను, మాటలను సృష్టించిన సినీబ్రహ్మ‘చారి’. ‘నీవేనా నను పిలిచినది’, ‘మనసు పరిమళించెనే-తనువు పరవశించెనే’, ‘ప్రేమ కోసమై వలలో పడెనే’, ‘రావోయీ చందమామ’.. ఆయన పాటలన్నీ రసరమ్య గీతాలే!

‘ఎందుకే అంత కోపం బుల్‌బుల్’, ‘దుషట చతుషటయము’, ‘రసపట్టులో తర్కం కూడదు’... ఈ చమత్కారాలు విన్నప్పుడల్లా పింగళికి ‘వెయ్యిరా వీరతాడు’ అనాలనిపిస్తుంది.

No comments:

Post a Comment