Monday, January 24, 2011

ఉయ్యూరు ఊసులు - Vuyyuru vusulu


ఎవ్వరికైనా మన ఊరు అంటే ఇష్టం. అది పల్లెటూరు అయితే ఇంకా ఎక్కువ మమకారం. ఈ పట్టణీకరణ బాగా పెరిగిపోయినాక సొంత ఊరుకు వెళ్ళటమే గగనమై పోతుంది. ఇక చేసేది మన ఊరి జ్ఞాపకాలూ, బాల్య స్మృతులూ నెమరు వేసుకోవటం మాత్రమే! అలా కేవలం ఊహలకే పరిమితం చేయకుండా, వాటికి అక్షరబద్ధం కల్పించారు గబ్బిట కృష్ణమోహన్ గారు. ఒక రెండు మూడు తరాల కిందటి ఉయ్యూరు విశేషాలను "ఉయ్యూరు ఊసులు" అనే పుస్తకం రూపంలో వెలువరించారు. ప్రచురించింది సరస భారతి.చక్కగా  pdf ఫైల్ గా కూడా రూపొందించారు. అయితే పేజీలు కుడి నుండి ఎడమకు వుండటం కొంచెం ఇబ్బందికరంగా వుంది.

ఇందులో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు:



























ఈ పుస్తకం వుయ్యూరుతో (క్షమించాలి వుయ్యూరు కాదు..ఉయ్యూరు. ఇలా అని ఈ పుస్తకం చదివాక తెలిసింది!) సంబంధం ఉన్న వారే కాకా, ప్రతీ తెలుగువాడు చదువతగ్గది. తెలుగు వారి ఆచార వ్యవహారాలు, పండుగలూ పబ్బాలూ, జాతరలూ మొ||వి దాదాపు ఒక యాభై సంవత్సరాల క్రితం ఎలా వుండేవో ఇందులో రచయిత చక్కగా వివరించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మినీ ఆంధ్ర ప్రదేశ్ ను ఆవిష్కరించారు. తరాలూ, వాటి మధ్య అంతరాలు, మారిన కాలానికి అనుగుణంగా వస్తూన్న మార్పులు, వాటితో పాటుగా మారలేని మనుషులూ, ఇందులో కనిపిస్తారు.

అలానే ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చిన సాంఘిక ఆర్ధిక రాజకీయ మార్పుల గురించి కూడా అక్కడక్కడా చర్చించారు.


తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పక చదువవలసిన పుస్తకం ఇది!

Download here: Vuyyuru Oosulu

ఇక్కడ క్లిక్ చేయండి డౌన్లోడ్ చేసుకోవడానికి:  ఉయ్యూరు ఊసులు

No comments:

Post a Comment